ETV Bharat / state

తెదేపా శ్రేణులపై అక్రమ కేసులను సహించేది లేదు: అఖిల ప్రియ - మాజీమంత్రి భూమా అఖిలప్రియ తమ్ముడిపై కేసు వార్తలు

పోలీసుల అండతోనే వైకాపా నాయకులు రాజకీయాలు చేస్తున్నారని మాజీమంత్రి భూమా అఖిలప్రియ ఆరోపించారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని పోలీసులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కేసు విషయంలో అరెస్టైన నిందితులను రిమాండ్​కు తరలించకుండా నిబంధనలకు విరుద్ధంగా పోలీస్​స్టేషన్​లో ఉంచారని మండిపడ్డారు.

former minister bhuma akhilapriya  outraged  on ysrcp leaders
మాజీమంత్రి భూమా అఖిలప్రియ
author img

By

Published : Jun 24, 2020, 9:10 AM IST

మీడియాతో మాట్లాడుతున్న మాజీమంత్రి భూమా అఖిలప్రియ

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని పోలీసులపై మాజీమంత్రి భూమా అఖిలప్రియ ఆగ్రహాం వ్యక్తం చేశారు. తన తమ్ముడి కేసు విషయంలో అరెస్టైన నిందితులను రిమాండ్​కు తరలించకుండా పోలీసు స్టేషన్​లోనే ఉంచడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్సై రామిరెడ్డిలపై మండిపడ్డారు. తెదేపా నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే సహించేదిలేదని హెచ్చరించారు. పోలీసుల అండతో వైకాపా నాయకులు ఇలా చేస్తున్నారని అన్నారు. వైకాపా నాయకులు ఇలాంటి పరోక్ష రాజకీయాలు చేయడం కన్నా.. ప్రజల్లోకి వచ్చి ప్రత్యక్ష రాజకీయాలు చేయాలన్నారు. పోలీసులు ఇలాంటి అక్రమాలకు సహకారం అందిస్తే భవిష్యత్తులో ప్రజల విశ్వాసం కోల్పోతారన్నారు. తప్పులు చేసే కొందరి వల్ల నిజాయితీపరులైన పోలీసులు తలదించుకోవాల్సి వస్తుందని తెలిపారు.

ఇదీ చూడండి. 'మా డిపాజిట్లు ఇప్పించేలా చర్యలు తీసుకోండి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.