శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. 10 గేట్ల ద్వారా 7 లక్షల 78 వేల 430 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 184.81 టీఎంసీలుగా ఉంది. ఇన్‌ఫ్లో 8 లక్షల 82 వేల 690 క్యూసెక్కులుగా నమోదవుతోంది. ఔట్ ఫ్లో 8 లక్షల 81 వేల 28గా ఉంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 42,378 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 30,194 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. హంద్రీనీవాకు 2,026 క్యూసెక్కులు విడుదల చేయగా...పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 28 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
ఇదీ చదవండి:
రాంగ్ పార్కింగ్‌ను ప్రశ్నించినందుకు... సెల్‌ఫోన్ పగలగొట్టేసింది!