శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 84,063 క్యూసెక్కులు ఉండగా... ఔట్‌ఫ్లో 96,659 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 884.90 అడుగుల మేర ఉంది. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటినిల్వ 215.32 టీఎంసీలకు చేరింది. జలాశయం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో అధికారులు విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రాన్ని రైతులు లేని రాజ్యంగా మార్చడమే లక్ష్యమా..? : లోకేశ్