కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండితుల వేద మంత్రోచ్ఛారణల నడుమ స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరిపించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: