కర్నూలు జిల్లా ఆదోనిలో అగ్ని ప్రమాదం జరిగింది. బుడ్డేకళ్లు పట్టణంలోని ఒక ఇంట్లో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి...దీంతో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలి పోయాయి. కుటుంబసభ్యులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా...వారు వెంటనే స్పందించారు. మంటలు అదుపులోకి తేవడంతో ప్రాణ నష్టం జరగలేదు. మంటలకు ఇంట్లో వస్తువులన్నీ కాలిపోయి... దాదాపు లక్ష రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితురాలు లక్ష్మి తెలిపారు.
ఇదీ చూడండి: అంతర్జాతీయ మ్యాచ్‌లకే ఆతిథ్యమిచ్చిన ఆ స్టేడియానికి...ఇప్పుడేమైంది?