కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం ఎస్. లింగందిన్నె గ్రామంలో తెదేపా, వైకాపా వర్గాల మధ్య గొడవ జరిగింది. గ్రామంలో ఎస్సీ కాలనీ లోని మురుగు కాలువల విషయంలో ఇరు పార్టీల నేతలు గొడవకు దిగారు. తీవ్రరూపం దాల్చి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఇరు వర్గాలకు చెందిన 10 మంది గాయపడ్డారు.
వీరిని ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సీఐ సుదర్శన్ ప్రసాద్, ఎస్ఐ వరప్రసాద్ ఆసుపత్రికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ప్రమాదకరంగా ఉన్న కారణంగా... వారిని నంద్యాలకు తీసుకు వెళ్లారు. ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేస్తామని సీఐ తెలిపారు.
ఇదీ చదవండి: