స్థల వివాదం ఇరువర్గాల మధ్య చిచ్చుపెట్టింది. పదునైన ఆయుధాలతో దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని దొర్నపాడులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన హుస్సేన్ సామా, మహబూబ్ ముల్లాల మధ్య చేలరేగిన స్థల వివాదం పరస్పర దాడులకు దారి తీసింది. తీవ్రంగా గాయపడిన ఇరువర్గాలను ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి