కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఆటో డ్రైవర్ల మధ్య చేలరేగిన చిన్న ఘర్షణ గొడవకు దారితీసింది. పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ షేక్ వలీ తన ఆటోతో వెళ్తుండగా మినరల్ వాటర్ సరఫరా చేసే మరో ఆటోను ఢీకొట్టింది. ఈ విషయమై ఇద్దరు డ్రైవర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో రెచ్చిపోయిన నీళ్ల ఆటో డ్రైవర్ తన మిత్రులతో కలిసి షేక్ వలీపై దాడికి తెగబడ్డారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలను అక్కడున్నవారు చరవాణిలో బంధించగా వాటి ఆధారంగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీచదవండి