గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పెద్ద గొట్టిపాడుకు చెందిన గుంటుపల్లి వెంకటప్రసాద్, గుంటుపల్లి చంద్ర తండ్రీకొడుకులు. ద్విచక్ర వాహనాలను దొంగలించడమే పనిగా పెట్టుకున్న వీరి పై పలు పోలీసు స్టేషన్లలో 5 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో కర్నూలు జిల్లా మహానంది మండలం సీతారామపురం గ్రామంలో ఉంటున్నారు. పలుచోట్ల తిరుగుతూ అన్నదాన సత్రాల్లో మకాం వేసి తిరుగుతూ ఉండేవారు. అనుమానం వచ్చిన నంద్యాల పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా ద్విచక్రవాహనాల చోరీలు వెలుగులోకి వచ్చాయి. వారిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. విచారణ జరుపుతున్నట్లు నంద్యాల సీఐ మల్లికార్జున తెలిపారు.
ఇదీ చూడండి
పట్టపగలే కారులోని వ్యక్తులపై పెట్రోల్ పోసి నిప్పంటించి..ఆపై డోర్ లాక్ చేసి