ETV Bharat / state

MAN PROTEST: చెట్టు ఎక్కి వ్యక్తి నిరసన.. ఎందుకంటే.. - protest on tree

FATHER FIGHT FOR PENSION: కుమారుడికి పింఛన్ రావడం లేదని ఓ తండ్రి చెట్టు ఎక్కి హల్​చల్ చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని, అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

కుమారుడికి పింఛన్‌ రావడం లేదని చెట్టు ఎక్కిన తండ్రి

author img

By

Published : Jan 16, 2022, 8:00 AM IST

FATHER PROTEST FOR SON: కుమారుడికి పింఛన్ రావడం లేదని తండ్రి చెట్టు ఎక్కి భయబ్రాంతులకు గురిచేసిన ఘటన కర్నూలు జిల్లా చాగలమర్రిలో జరిగింది. 15 ఏళ్ల సద్దాం అనే తన కుమారుడు మానసిక వైకల్యంతో బాధపడుతూ ఉన్నా.. అధికారులు పింఛన్ ఇవ్వటం లేదని అమీర్ అనే వ్యక్తి ఒక పెద్ద వేప చెట్టు ఎక్కి హల్‌చల్‌ చేశాడు. తన కుమారుడికి పింఛన్ మంజూరు చేయకపోతే చెట్టుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అమీర్‌తో మాట్లాడి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అరగంట పాటు అతనితో చర్చించి అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు అమీర్ కిందికి దిగాడు.

ఇదీచదవండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.