కర్నూలు జిల్లా బండిఆత్మకూరు మండలంలోని ఎ.కోడూరు గ్రామానికి చెందిన చవటపల్లి వెంకటేశ్వర్లు(50)కు వెంకటకృష్ణ, వెంకట సుధాకర్ ఇద్దరు కుమారులు. వీరిలో వెంకటకృష్ణ(28) వారం నుంచి జ్వరంతో బాధ పడ్డారు. ఆర్‌ఎంపీ వద్ద చూపించగా టైఫాయిడ్ జ్వరం అని చెప్పడంతో మందులు వాడారు. గురువారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. కుమారుడి మృతిని తట్టుకోలేక తండ్రి వెంకటేశ్వర్లు కన్నీరుమున్నీరుగా విలపించారు. సొమ్మసిల్లి తండ్రి వెంకటేశ్వర్లు కూడా మృతి చెందారు. వెంకటకృష్ణకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. శుక్రవారం ఉదయం గ్రామంలో తండ్రీకొడుకుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు.
ఇదీ చదవండి: పనిచేస్తున్న దుకాణంలో చోరీ... గంటల్లోనే ఛేదించిన పోలీసులు