ETV Bharat / state

MURDER ATTEMPT: కుమార్తెపై తండ్రి కత్తితో దాడి.. కారణమేంటంటే..?

కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణం జరిగింది. ఇష్టం లేని పెళ్లి చేసుకుందన్న కోపంతో కన్నకూతురిపైనే తండ్రి దాడికి పాల్పడ్డాడు. కత్తితో హత్య చేసేందుకు యత్నించాడు. ఈ ఘటనలో ఆమె గాయపడటంతే.. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కూతురిపై కత్తితో దాడి చేసిన తండ్రి
కూతురిపై కత్తితో దాడి చేసిన తండ్రి
author img

By

Published : Sep 12, 2021, 5:26 PM IST

ఇష్టం లేని వివాహం చేసుకుందని కన్నకూతురిపై.. తండ్రి కత్తితో దాడి చేసిన ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగింది. పట్టణంలోని దేవనగర్​కు చెందిన మల్లీశ్వరి హరిజనపేటకు చెందిన మంజు అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొద్ది రోజుల తరువాత వివాహం గురించి మాట్లాడుకుందామని ఆమెను ఇంటికి పిలిపించిన తండ్రి.. కత్తితో దాడి చేశాడు. గమనించిన కుటుంబసభ్యులు గాయపడ్డ యువతిని నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కూతురిపై కత్తితో దాడి చేసిన తండ్రి

నేను, మంజు పెళ్లి చేసుకుని పది రోజులు అవుతోంది. మాట్లాడుకుందాం ఇంటికి రండి అని పిలిచి మా వాళ్లు ఈ దారుణానికి పాల్పడ్డారు. అరగంట వరకు బాగా మాట్లాడి, ఒక్కసారిగా కత్తితో దాడి చేశారు. నా భర్త గమనించి, నన్ను ఆస్పత్రికి తీసుకువచ్చాడు.

-బాధితురాలు

ఇదీచదవండి.

Theft: జల్సాలకు అలవాటు పడి... ద్విచక్ర వాహనాలు దొంగతనం చేస్తూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.