తండ్రి మరణంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు ఓ కుమారుడు. కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డనాగేరి గ్రామంలో మారెన్న అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. నిన్న సాయంత్రం మారెన్నకు అతని కుమారుడు గిడ్డయ్య.. అంత్యక్రియలు నిర్వహించాడు.
తండ్రి మరణాన్ని తట్టుకోలేకే కుమారుడు పొలంలో ఊరి వేసుకొని నేడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు. గిడ్డయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిద్దరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి:
'సీఎం గారూ.. ఔషధాన్ని ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు సహకరించండి'