ETV Bharat / state

బ్రకోలీ సాగు చేసి లబోదిబోమంటున్న రైతులు - Broccoli crop

పాత పద్ధతులను అనుసరిస్తూ నష్టపోయిన రైతన్నలకు కొత్తపంటల వైపు మొగ్గు చూపినా నష్టాలు తప్పడం లేదు. వినూత్నంగా బ్రకోలి పంటను సాగు చేసిన సి.బెళగల్‌ మండలం గొల్లలదొడ్డికి చెందిన పది మంది రైతులు 12 ఎకరాల్లో ఈ పంటను పండించారు. 70 రోజుల నుంచి 90 రోజుల్లో పంట చేతికొస్తుంది. ఎకరాకు ఎనిమిది టన్నుల వరకు దిగుబడి వస్తుందన్నారు. బెంగళూరులో దీని ధర కిలో రూ.350 వరకు పలుకుతోందని, దళారులు మాత్రం రూ.40 కంటే ఎక్కువ ఇవ్వడం లేదని రైతులు రామచంద్ర, చంద్రన్న వాపోతున్నారు.

బ్రకోలీ సాగు చేసి లబోదిబోమంటున్న రైతులు
బ్రకోలీ సాగు చేసి లబోదిబోమంటున్న రైతులు
author img

By

Published : Mar 2, 2021, 7:58 PM IST

కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం దొడ్డి గ్రామంలో ఈ ఏడాది రైతులు నూతనమైన బ్రకోలి పంట సాగుచేశారు. ముందస్తు మార్కెట్లో కిలో బ్రకోలి ధర 300 రూపాయలు నుంచి 400 వరకు ఉంది. ఈ పంటను బెంగళూరు వంటి మహా నగరాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ పంటను సాగు చేస్తే రైతులు లక్షల ఆదాయం పొందవచ్చని దళారులు విత్తనాలు పంపిణీ చేసి నమ్మించి సాగు చేయించారు. దీంతో గ్రామంలోని రైతులు ఒక్కొక్కరు ఎకరాల చొప్పున 12 ఎకరాలు సాగు చేశారు.

బెంగళూరులో దీని ధర కిలో రూ.350 వరకు పలుకుతోందని, దళారులు మాత్రం రూ.40 కంటే ఎక్కువ ఇవ్వడం లేదని రైతులు రామచంద్ర, చంద్రన్న వాపోయారు. దీంతో రైతులు ధర ప్రభావంతో లబోదిబోమంటున్నారు. విత్తనం 10 వేలు, పెట్టుబడి ఖర్చు 40 వేల వరకు మొత్తంగా 50 వేల రూపాయలు ఖర్చు అయినా కనీస పెట్టుబడి రావడం లేదు. దీంతో రైతులు నష్టాల బారిన పడుతున్నారు.

బ్రకోలీ సాగు చేసి లబోదిబోమంటున్న రైతులు

ముందుగా కొనుగోలుదారులతో ఒప్పందం చేసుకుని, పువ్వు అరకిలోకు మించకుండా కోసిన తర్వాత వాటిని ప్రత్యేకంగా ప్యాకింగ్‌ చేసి శీతల గదుల్లో భద్రపరుచుకుంటే ఆశించిన ధర వస్తుందని కోడుమూరు ఉద్యానవన శాఖాధికారిణి విజయలక్ష్మి తెలిపారు.

*ఎకరాకు 40 మంచి 50 క్వింటాల దిగుబడి:
బ్రకోలీ సాగు చేసిన రైతులకు ఈ పంట ఒక వరం లాంటిది. శీతాకాలంలో ఈ పంట సాగు పై రైతులు మక్కువ చూపుతున్నారు. ఈ పంట దిగుబడి ఎకరాకు 40 నుంచి 50 క్వింటాల దిగుబడి వస్తుంది. పంట దశ 70 నుంచి 80 రోజులు. ఈ కాలంలో వచ్చిన పంట బరువు 300 గ్రాముల చొప్పున ఉండాల్సింది. ఇలా ఉంటే కిలో రూపాయల 400 వరకు ధర పలుకుతోంది.

*బ్రకోలీ ప్రత్యేకతలు:
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కూరగాయలు బ్రకోలికి ప్రత్యేక స్థానం ఉంది .ఇటలీ దేశానికి చెందిన బ్రకోలి క్యాబేజీ, కాలీఫ్లవర్ జాతికి చెందినటువంటి వంగడం. దీని శాస్త్రీయ నామం బ్రాసిక ఒలేరాసియా.ఈ బ్రోకోలికి మంచి డిమాండ్ ఉంది.

*క్యాన్సర్ నివారణకు దోహం చేస్తోంది
రోగనిరోధక శక్తిని పెంచడానికి, అధిక విటమిన్ గల ఈ బ్రకోలి క్యాన్సర్ నిరోధక నిరోధకానికి ఔషధంగా పనిచేస్తుంది. దీంతోపాటు శరీరంలోని కొవ్వు తగ్గించడానికి మంచి దోహదకారిగా పనిచేస్తుంది. 90% ఇది నీటి నిల్వలు, 31 శాతం క్యాలరీలు, ఫైబర్ వంటి గుణాలు బ్రకోలీలో లభిస్తాయి.

ఇవీ చదవండి

వెల్దుర్తిలో ఒకే రోజు మూడు ఆలయాల్లో చోరీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.