పొలానికి రాస్తా (రహదారి) లేదనే వేదన.. అతనిని తరచూ బాధించేది. రాస్తా లేని పొలాన్ని కౌలుకు తీసుకునేవారు కరువయ్యారు. కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దింతో మనస్తాపం చెందిన రైతు పొలంలోనే ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచాడు. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.
గోస్పాడు మండలం పసురపాడు గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య అనే రైతుకు శ్రీరాంనగర్ లో 13 ఎకరాల భూమి ఉంది. కానీ ఆ పొలానికి వెళ్లేందుకు మార్గం లేదు. పక్కనే ఉన్న పొలం యజమానులు అతని బంధువులే. వారితో పలుమార్లు చర్చలు చేశాడు. గట్టి ప్రయత్నమే చేశాడు. ఫలితం లేకపోవడంతో మనస్థాపానికి గురైన వెంకటసుబ్బయ్య(50) పొలంలోనే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: