అర్హులైన చేనేతలకు నేతన్న నేస్తం పథకం అందలేదని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మాజీఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి విమర్శించారు. చేనేతపురిగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అర్హులను కాకుండా అనర్హులను లబ్ధిదారులుగా గుర్తించారని ఆరోపించారు.
రాష్ట్రంలో స్కీములు పేరిట స్కాములు జరుగుతున్నాయని జయనాగేశ్వర రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం బీసీ నాయకులపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ... కేసులు బనాయిస్తోందని ధ్వజమెత్తారు.