ETV Bharat / state

పుర ఎన్నికల వి'చిత్రం'.. మాజీమంత్రి ఫోన్ సంభాషణ వైరల్..!

author img

By

Published : Mar 5, 2021, 11:01 PM IST

రాష్ట్రంలో పురపాలక ఎన్నికలు పలు విచిత్రాలకు వేదికవుతున్నాయి. సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో పబ్లిక్ లైఫ్​లో ఉన్నవారు.. మరీ ముఖ్యంగా రాజకీయ పార్టీల నేతలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం మిస్ అయినా... ట్రోల్ కాక తప్పదు. తాజాగా కర్నూలు జిల్లాలో ఓ మాజీమంత్రి, కౌన్సిలర్ అభ్యర్థి సంభాషణ నెట్టింట వైరల్ అవుతోంది. ఆ మాజీమంత్రి... కౌన్సిలర్​ను పోటీ నుంచి తప్పుకోమని అడగడం... దానికి అతను గట్టిగా సమాధానం చెప్పడం జిల్లాలో చర్చనీయాంశమైంది.

Ex Minister Phone Call to Counselor Candidate

కర్నూలు జిల్లాలో మాజీమంత్రి, కౌన్సిలర్ అభ్యర్థి మధ్య జరిగిన సంభాషణ ఇలా జరిగింది. ఆ మాజీమంత్రి ఓ పార్టీ అభ్యర్థి అనుకొని ఫోన్ చేశారు. కానీ తీరా మాట్లాడాక తెలిసింది అవతలి వ్యక్తి అనుకున్న అభ్యర్థి కాదని... అసలు వారిద్దరి మధ్య ఫోన్​ సంభాషణ ఎలా సాగిందంటే...

మాజీమంత్రి: ఏంలేదు గానీ మన క్యాండెట్ ఒకరు... ఏందదీ.. మన వైఎస్​నగర్...

కౌన్సిలర్ అభ్యర్థి: అట్లగాదు సార్.. ఇప్పుడు మేం నిలబడిందే ఆరు చోట్ల. ఒక క్యాండెట్​కి రాత్రి డబ్బులిచ్చి కొనేసినారు. మిగతా దాంట్లో కూడా...

మాజీమంత్రి: ఎన్నో వార్డు

కౌన్సిలర్ అభ్యర్థి: ఇది ఎనిమిదో వార్డు సార్... మార్కెట్ యార్డు వాళ్లు

మాజీమంత్రి: అది నాకు ఐడియా కూడా లేదు.

కౌన్సిలర్ అభ్యర్థి: అట్లా కాదు సార్.. మేం ఆరు వార్డుల్లో... దాంట్లో ఒక వార్డు మీరు తీసుకున్నారు. మిగతా వార్డుల్లో అయినా మేం చేసుకోకూడదా సార్..

మాజీమంత్రి: ఎనిమిదో వార్డులో నిలబడింది... నాకు ఐడియా కూడా లేదు.

కౌన్సిలర్ అభ్యర్థి: మీరే న్యాయం చెప్పండి సార్... 42 వార్డుల్లో మేం ఐదు వార్డుల్లో నిలబడ్డాం.

మాజీమంత్రి: ఇప్పుడు నేను కూడా ఏం అనడం లేదు. ఇప్పుడు ఏందంటే... మా వైస్​నగర్ రమణ కూడా కొంచెం పేదవాడు. పని చేస్తాడు.

కౌన్సిలర్ అభ్యర్థి: ఆహా... అట్ల కాదు సార్.. ప్రతీఒక్క వార్డులో మీ క్యాండెట్లు అందరు చెప్తున్నారు. ఇంకా రాజకీయపరంగా ఎవ్వరూ ముందుకు రావద్దా చెప్పండి సార్. మీరే అందరూ... ఎప్పుడు మీరే ఉండాల్న చెప్పండి..

మాజీమంత్రి: లేదండి.. నేను అట్లా అనడంలే.

కౌన్సిలర్ అభ్యర్థి: దేవుని దయవల్ల మీరు ఇంతకు ముందర మినిస్టర్ అయినారు. మీ కొడుకు ఇప్పుడు ఎమ్మెల్యే అయినారు. ఇప్పుడు మీ కోడలు వచ్చి... ఛైర్మన్ (ఛైర్​పర్సన్) పదవి కూడా వచ్చేస్తుంది. అది కూడా సంతోషమే. మీరే ఆలోచించండి.

మాజీమంత్రి: అవకాశం ఉంటే చూడండి..

కౌన్సిలర్ అభ్యర్థి: అహా.. అవకాశం కాదు సార్... మేం గెలిచేది ఉండది అక్కడ.

మాజీమంత్రి: అది కూడా ఎంఐఎం పార్టీ కాబట్టి నేను అడుగుతున్నా. ఎందుకంటే... ఓవైసీ గారు కూడా బాగా దగ్గరగా ఉంటారు మనకు. అదే మిగతా వాళ్లను అయితే అడుగుతామా.. వేరే వాళ్లను అడుగుతలేం.

కౌన్సిలర్ అభ్యర్థి: అలా కాదు సార్.. ఎంఐఎం కాదు సార్ మాది..

మాజీమంత్రి: ఎంఐఎం అయితే మనకు కొంచెం అనుకూలంగా ఉంటారు కాబట్టి అడుగుతున్నా.. మన జగన్​తో మంచిగ ఉంటారు కాబట్టి అడుగుతున్న అంతే.

కౌన్సిలర్ అభ్యర్థి: హహ.. మేం ఎంఐఎం కాదు సార్

మాజీమంత్రి: ఎంఐఎం కాదా..

కౌన్సిలర్ అభ్యర్థి: ముస్లీం లీగ్ సార్.

మాజీమంత్రి: ముస్లీం లీగ్ ఆఆ.. ఎక్కడ ఇక్కడ మన దగ్గరేనా..

కౌన్సిలర్ అభ్యర్థి: ఆ సార్... ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సార్.

మాజీమంత్రి: ఓకే ఓకే ఓకే అమ్మా.. చూసుకో. ఏదైనా అవకాశం ఉంటే చూడండి.

కౌన్సిలర్ అభ్యర్థి: సరే సార్... సరే సార్.

మాజీమంత్రి: ఏదైనా ఉంటే రమణ మీతో మాట్లాడతారు.

ఇదీ చదవండీ... 'నన్ను అరెస్టు చేసి ఇబ్బంది పెట్టేందుకు కుట్ర పన్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.