కర్నూలు సరిహద్దు పంచలింగాల చెక్ పోస్టు వద్ద ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఆర్టీసీ బస్సులో ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న 13.3 కేజీల వెండిని గుర్తించారు. నాసిర్ హుస్సేన్ అనే వ్యక్తి నుంచి 78 వెండి బిస్కేట్లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. విచారణ నిమిత్తం నిందితుడిని తాలూకా పోలీసులకు అప్పగించారు. ఆ వెండిని హైదరాబాద్ నుంచి నంద్యాలకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: రూ.20 కోట్ల అప్పు చేసి పరారయ్యాడు..!