కర్నూలు జిల్లా ఆదోనిలోని ఇంద్ర నగర్లో దారుణం జరిగింది. నందకిషోర్ అనే 11 నెలల చిన్నారి.. ఆడుకుంటూ నీటి గుంతలో పడి మరణించాడు. బాలుడి మృతితో తల్లి తండ్రులు హుస్సేన్, రోజా కన్నీరుమున్నీరు అయ్యారు.
సాయంత్రం ఇంటి ఆవరణలో నందకిషోర్ ఆడుకుంటున్నాడు. అనుకోకుండా పక్కనే ఉన్న కుళాయి గుంతలో పడి పోయాడు. ఎవరూ గమనించకపోవడంతో.. బాలుడు గుంతలోనే శవమై తేలినట్లు స్థానికులు తెలిపారు.
ఇదీ చదవండి: