ETV Bharat / state

దేవరగట్టు నెత్తురోడింది..! - devaragattu karrala samaram

కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరంలో రక్తం చిందింది. పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం బన్ని ఉత్సవానికి భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. పోలీసులు పటిష్ఠ చర్యలు చేపట్టినా...అవి ఆచారం ముందు నిలబడలేకపోయాయి.

దేవరగట్టు కర్రల సమరం నెత్తురోడింది..!
author img

By

Published : Oct 9, 2019, 6:09 AM IST

Updated : Oct 9, 2019, 4:50 PM IST

దేవరగట్టు కర్రల సమరం నెత్తురోడింది..!
కర్నూలు జిల్లా దేవరగట్టులో ఏటా విజయదశమి రోజు కర్రల సమరం జరగడం ఆనవాయితీ. హోళగుంద మండలం దేవరగట్టు సమీపంలో ఉన్న కొండపై వెలసిన మాళమల్లేశ్వరస్వామికి అర్థరాత్రి 12 గంటలకు కల్యాణం జరిపించారు. అనంతరం కొండ పరిసర ప్రాంతాల్లో ఉన్న పాదాలగట్టు, రక్షపడ, శమీవృక్షం, ఎదురుబసవన్నగుడి ప్రాంతాల్లో దివిటీల వెలుతురులో ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. ఈ ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవటం కోసం... మూడు గ్రామాల ప్రజలు ఓ వర్గంగా, ఐదు గ్రామాల ప్రజలు మరో వర్గంగా ఏర్పడి కర్రలతో తలపడ్డారు. బన్ని ఉత్సవంగా పిలిచే ఈ సమరాన్ని అడ్డుకోవడానికి పోలీసులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. గాయపడిన వారి కోసం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు 30 పడకల తాత్కాలిక ఆరోగ్య కేంద్రాన్ని సిద్ధం చేశారు.

ఇలవేల్పు కోసం...
మాళమ్మ, మల్లేశ్వరస్వామివార్లు... రాక్షస సంహారం చేసిన తర్వాత... బన్ని ఉత్సవం నిర్వహిస్తారు. తమ ఇలవేల్పు దైవాన్ని స్వాధీనం చేసుకోవటం కోసం.. నెరణికి, నెరణికి తాండా, కొత్తపేట గ్రామాల ప్రజలు ఓ జట్టుగా... ఆలూరు, సుళువాయి, ఎల్లార్తి, అరికెర, నిడ్రవట్టి, బిలేహాల్‌ గ్రామాల ప్రజలు మరో జట్టుగా ఏర్పడి కర్రలతో తలపడ్డారు. ఇందులో ఇరువర్గాల వారు తీవ్రంగా గాయపడ్డారు. ఆచారాన్ని ఈ ఏడాది కొనసాగించారు. ఉత్సవాలను తిలకించేందుకు కర్నాటక, తెలుగు రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్పలు ప్రత్యక్షంగా పరిస్థితిని సమీక్షించారు.

భారీగా బందోబస్తు...కానీ
బన్ని ఉత్సవంలో హింస జరగకుండా ఉండేందుకు పోలీసులు చేపట్టిన చర్యలు ఏ మాత్రం ఫలించలేదు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, ఫాల్కాన్‌ వాహనంతో నిఘా ఏర్పాటు చేశారు. 1000 మందికి పైగా పోలీసులతో బందోబస్తు చేపట్టారు. నెల రోజుల ముందు నుంచే అవగాహన కార్యక్రమాలు, ఫ్లెక్సీలు, లఘు చిత్రాలతో ప్రచారం నిర్వహించారు. మద్యాన్ని అరికట్టడం కోసం ఆబ్కారీ అధికారులు ఎన్నో ప్రయత్నాలు చేసినా నాటు సారా ఏరులై పారింది. ఉత్సవంలో పాల్గొన్న వారిలో ఎక్కువమంది మద్యం సేవించి రావటం వలన గాయాలయ్యాయి. ఎన్ని చర్యలు చేపట్టినా గ్రామస్తులు.. వారి సంప్రదాయాన్ని కొనసాగించారు. కర్రల సమరంలో ఈ ఏడాది 50 మందికి పైగా గాయపడ్డారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మొత్తానికి దేవరగట్టు కర్రల సమరంలో ప్రాణ నష్టం జరగకపోవటంతో పోలీసులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చదవండి :

దసరాకు కర్రల సమరం... 11 గ్రామాల ప్రజల రణరంగం

Intro:AP_ONG_12_08_SP_ON_VIJAYA_DASAMI_AV_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
..........................
అచ్చమైన తెలుగింటి వస్త్రధారణ లో ముస్తాబైయ్యాడు ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్ద్ కౌశల్ ...ఉత్తర భారతీయుడైన పంచ లాల్చీ ధరించి దసరా ఉత్సవాల్లో పాల్గొన్నాడు. ప్రకాశం జిల్లా ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన దసరా ఉత్సవాల్లో తెలుగుదనం ఉట్టిపడేలా కనిపించి అబ్బురపరిచాడు..అధునాతన ఆయుధ పూజ స్వయంగా చేసి దుర్గ దేవి పూజలో పాల్గొన్నాడు.....విజువల్స్
Body:ఒంగోలుConclusion:9100075319
Last Updated : Oct 9, 2019, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.