కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో అయ్యలూరు మెట్ట వద్ద ప్రభుత్వ భూమిలో ఉన్న పలు నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. కేసీ కాలువ పక్కన ఉన్న 70 సెంట్ల ప్రభుత్వ భూమిలో కొన్నేళ్లుగా కొందరు దుకాణాలు ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. రెవెన్యూ శాఖ అధికారులు వాటిని యంత్రాల సాయంతో కూల్చివేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా దుకాణాలు కూల్చివేయడం అన్యాయమని భాదితులు వాపోతున్నారు.
ఇవీ చూడండి...