తమ సమస్యలు పరిష్కరించాలని డేటా ఎంట్రీ ఉద్యోగులు కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. 2008 నుంచి పని చేస్తున్న తమను అధికారులు తొలగించి కొత్తవారిని నియమించారన్నారు. పదకొండు నెలలుగా జీతాలు ఇవ్వలేదని ఆవేదన చెందారు.
డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టు అవుట్ సొర్సింగ్ సర్వీస్ కార్పొరేషన్లో చేర్చినందుకు సంక్షేమ పథకాలు అందడం లేదని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 234 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉండగా కర్నూలు జిల్లాలో 13 మంది ఉన్నారని వెల్లడించారు. బకాయి వేతనాలు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
ఇదీ చదవండి: