ETV Bharat / state

DASARA AT SRISAILAM: నేడు చంద్రఘంట అలంకారంలో అమ్మవారి దర్శనం

దసరా మహోత్సవాల్లో భాగంగా నేడు శ్రీభ్రమరాంబాదేవి భక్తులకు చంద్రఘంట అలంకారంలో దర్శనమివ్వనున్నారు. స్వామిఅమ్మవార్లకు రావణవాహనసేవ జరుగనుంది.

DASARA AT SRISAILAM
DASARA AT SRISAILAM
author img

By

Published : Oct 9, 2021, 9:10 AM IST

దసరా మహోత్సవాల మూడో రోజు శనివారం శ్రీభ్రమరాంబాదేవి భక్తులకు చంద్రఘంట అలంకారంలో దర్శనమివ్వనున్నారు. స్వామిఅమ్మవార్లకు రావణవాహనసేవ జరుగనుంది. హరిహరాయగోపురం వద్ద దేవీభాగవతం ప్రవచనం, కళాకారుల నృత్యప్రదర్శనలు జరుగనున్నాయి.

నవరాత్రులు రెండోరోజు బ్రహ్మచారిణి అలంకారంలో అమ్మవారు

దసరా ఉత్సవాల్లో భాగంగా శ్రీశైలం శ్రీభ్రమరాంబాదేవి శుక్రవారం భక్తులకు బ్రహ్మచారిణి అలంకారంలో దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలోని ఉత్సవ వేదికపై బ్రహ్మచారిణి అమ్మవారిని ఆలయ సిబ్బంది విశేష పుష్పాలంకరణలతో కొలువుదీర్చారు.

మయూర వాహనంపై కొలువుదీరిన స్వామిఅమ్మవార్లు

శ్రీగిరి క్షేత్రం ఆధ్యాత్మికశోభతో అలరారుతోంది. దసరా మహోత్సవాల సందర్భంగా భక్తులతో ఆలయ ప్రాంగణాలు కళకళలాడుతున్నాయి. నవదుర్గల దర్శనం భక్తజన హృదయాలను సమ్మోహనం చేస్తోంది. శ్రీస్వామిఅమ్మవార్లు మయూర వాహనంపై కొలువుదీరి పూజలందుకొన్నారు. ఆలయ ప్రత్యేక వేదికపై కొలువైన బ్రహ్మచారిణి అమ్మవారికి అర్చకులు, వేదపండితులు సమంత్రకంగా పూజలు చేసి మంగళహారతులు సమర్పించారు. అక్కమహాదేవి అలంకార మండపంలో మయూర వాహనాధీశులైన దేవదేవుల ఉత్సవమూర్తులను అర్చకులు కుంకుమ, సుగంధాలతో అలంకరించి పుష్పార్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. కళాకారిణులు ఆంధ్రనాట్యం ప్రదర్శించి ఆకట్టుకున్నారు.

భ్రమరాంబాదేవి ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా కుమారి పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు చిన్నారులకు కుమారి పూజలు నిర్వహించారు. లోకకల్యాణార్థం ఆలయంలో శ్రీచక్రార్చనలు, నవావరణార్చనలు, రుద్ర, చండీహోమాలు జరిపారు.

ఇదీ చదవండి:

Sexual Harassment: దైవదర్శనానికి వచ్చిన బాలికపై ఆలయ ఉద్యోగి లైంగిక వేధింపులు !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.