వైకాపా ప్రభుత్వంలో ఎస్సీలకు న్యాయం జరగడం లేదని కర్నూలు స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ కార్యాలయం ఎదుట ఎస్సీ సంఘాల నేతలు నిరసన తెలిపారు. 2017 సంవత్సరంలో జరిగిన తమ కుమార్తే ఆత్మహత్య కేసు విషయంలో పభుత్వం ఇప్పటికీ న్యాయం చేయలేదని పదో తరగతి విద్యార్థి ప్రీతీభాయ్ తల్లిదండ్రులు రోడ్డుపై భైఠాయించి నిరసన తెలిపారు. కేసును తప్పదోవ పట్టించేందుకు శ్వేతారెడ్డి తమపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తుందని ఆమెపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినా.. పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. శ్వేతారెడ్డిని అరెస్టు చేసి తమ కూతురి కేసు విషయంలో సీబీఐ విచారణ వెంటనే జరిపించాలని వారు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: