కర్నూలు నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని...కలెక్టర్ వీరపాండ్యన్ సూచించారు. గాజుల దిన్నె ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో వరద నీరు కోడుమూరులోని హంద్రీ నదికి పోటెత్తింది. వరద జలాలు మరింత పెరిగి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొత్తబస్టాండ్ కు వెళ్లే ప్రధాన రహదారులపైకి నీరు చేరడంతో...అధికారులు రాకపోకలను నిలిపివేశారు. నది తీరం వెంబడి పంట పొలాలు వరద నీటిలో మునిగిపోయాయి. గోనెగండ్ల, కోడుమూరు మండలాల్లోని పలు గ్రామాల్లో నది ఒడ్డునున్న... పత్తి, ఉల్లి, కూగాయల పంటలు నీట మునిగటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: