కర్నూలు జిల్లా రుద్రవరం మండల పరిధిలో పలు గ్రామాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. మండలంలోని ఆలమూరు నరసాపురం గ్రామాల్లో గాలివానతో 150 ఎకరాల్లో అరటి, 100 ఎకరాల్లో బొప్పాయి, 10 ఎకరాలలో తమల పాకు తోటలు నేలకొరిగాయి. పంట నష్టం వివరాలు తెలుసుకునేందుకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి ఈ గ్రామాల్లో పర్యటించారు. ఉద్యానవ శాఖ అధికారులతో కలిసి పంట నష్టం అంచనా వేశారు. పంట నష్టం వివరాలు నమోదు చేసి వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని ఎమ్మెల్యే సూచించారు. లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట చేతికి వస్తున్న దశలో ఒక గాలివాన దెబ్బతో ఈ ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోయారని, నష్టపోయిన రైతులకు తప్పక పరిహారం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఇది చదవంది కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు