కర్నూలు జిల్లా(kurnool district) మంత్రాలయం(mantralayam)పరిసరాల్లో తుంగభద్ర నది(Tungabhadra river) ఒడ్డున మొసలి(Crocodile) కలకలం సృష్టించింది. ఉదయం బహిర్భూమికి వెళ్లిన భక్తులు మొసలి చూసి భయాందోళనకు గురయ్యారు. నాలుగు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వరద నీటిలో మొసలి కొట్టుకొచ్చినట్లు స్థానికులు తెలిపారు. గతంలో కూడా భక్తులకు తుంగభద్ర నది రాతి బండపై మొసలి కనిపించింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి... నది తీరంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి