దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలని కర్నూలు జిల్లా ఆదోనిలో సీపీఎం నేతలు రాస్తారోకో చేశారు. పట్టణానికి వచ్చే, గ్రామాలకు వెళ్లే రహదారులు అధ్వాన్నంగా తయారై.. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తోందని ఆరోపించారు. కొత్త రోడ్లు వేయకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని .. ఆ పార్టీ మండల కార్యదర్శి వెంకటేశ్వర్లు హెచ్చరించారు.
ఇదీ చదవండి: మంగ్లీ పాట.. ఎమ్మెల్యే ఆర్థర్ ఆట