కౌంటింగ్ పాస్ ఇవ్వలేదని సీపీఎం నాయకులు ఆందోళన చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో పురపాలక కార్యాలయం దగ్గర 18వ వార్డు సీపీఎం నాయకులు కౌంటింగ్ పాస్లు ఇవ్వకపోవడంపై ఎన్నికల అధికారులపై ఆగ్రహం చెందారు. ఉద్దేశపూర్వకంగానే తమకు పాసులు ఇవ్వడం లేదని సీపీఎం నాయకులంటున్నారు. అధికారి పార్టీ అభ్యర్థులకు ఇచ్చి.. తమకు ఇవ్వకపోవడమేంటని ప్రశ్నించారు. పాసులు ఇస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఇదీ చదవండి: మున్సిపల్ ఎన్నికల ఫలితాలొచ్చే వరకు ఉత్కంఠే..!