ETV Bharat / state

ఉపాధి కూలీలను ఆదుకోవాలి: సీపీఐ రామకృష్ణ - kurnool

కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలోని పలు గ్రామాల్లో ఉపాధి పనులను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరిశీలించారు. మండు వేసవిని సైతం లెక్కచేయకుండా పనులు చేస్తున్న ఉపాధి కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.

సీపీఐ రామకృష్ణ
author img

By

Published : May 14, 2019, 3:16 PM IST

సీపీఐ రామకృష్ణ

మండు వేసవిని సైతం లెక్కచేయకుండా పనులు చేస్తున్న ఉపాధి కూలీలను సరైన వేతనాలు ఇచ్చి ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి పనులను ఆయన పరిశీలించారు. కూలీలతో ముచ్చటించి వారి కష్టాలను తెలుసుకున్నారు. మండుటెండలో చేతులకు బొబ్బలొచ్చేలా...పని చేస్తున్నా సరైన వేతనాలు రావడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో 370 కరువు మండలాలను గుర్తించిన ప్రభుత్వం.. వెంటనే వారికి పంట నష్ట పరిహారం అందించాలని కోరారు.

ఇదీ చదవండి

''ఈ ఏడాది మహానాడును ఎలా నిర్వహిద్దాం?''

Intro:పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వైశాఖ మాస తిరు కల్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి .మొదటి రోజు స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె లను ను చేయడంతో ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.

Body:అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు మంగళవారం నేత్రపర్వంగా ప్రారంభమయ్యాయి .తొలుత ఆలయ ముఖమండపంలో ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేసి పచ్చని పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం స్వామి ,అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆ మండపంలో వేంచేపు చేసి విశేషంగా అలంకరించారు. మేళతాళాలు, సన్నాయి వాయిద్యాల నడుమ వేద పండితులు వేద మంత్రాలు చదువుతూ స్వామి అమ్మవార్లను పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె లను చేశారు. ఈ ఆధ్యాత్మికత ఘట్టాన్ని తిలకించిన భక్త కోటి పులకించింది. అలాగే స్వామి వారు ఈ ఉత్సవాల సందర్భంగా రోజుకో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. దీనిలో భాగంగా ఉత్సవాలలో మొదటి రోజు శ్రీవారు శ్రీ భూ సమేత శ్రీమన్నారాయణ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రికి గజవాహనంపై స్వామివారి గ్రామోత్సవం కన్నుల పండుగగా జరగనుంది.

Conclusion:కల్యాణోత్సవాలను తిలకించేందుకు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.