కర్నూలు జిల్లా నంద్యాల శివారులోని శాంతిరామ్ వైద్యశాలలోని ఆరోగ్యశ్రీ పథకంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నంద్యాల ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. చిన్న శస్త్ర చికిత్సలు చేసి పెద్దవిగా చూపించి.... అటు రోగులు, ఇటు ప్రభుత్వం వద్ద డబ్బు దండుకుంటున్నట్లు సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రసూల్ ఆరోపించారు.
ఇదీ చదవండి:కర్నూలు నగరంలో బెట్టింగ్ ముఠా అరెస్ట్