కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎక్సైజ్ పోలీసు స్టేషన్ ముందు సీపీఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గ్రామాల్లో గొలుసు దుకాణాలను పూర్తిగా అరికడుతామని ప్రభుత్వం చెప్తుతున్నా... క్షేత్రస్థాయిలో యథేచ్ఛగా విక్రయాలు కొనసాగుతున్నాయని సీపీఐ నియోజకవర్గ నాయకులు పంపన్నగౌడ్, సత్యన్న ఆరోపించారు. వెంటనే వాటిపై చర్యలు తీసుకోవాలంటూ సీఐ మహేష్కుమార్కు వినతి పత్రం అందజేశారు.
ఇదీ చదవండి: అక్రమంగా మద్యం తరలింపు.... కొనసాగుతున్న అరెస్టుల పర్వం