ETV Bharat / state

'పాలకుల నిర్లక్ష్యం వల్లే సమ్మర్ ట్యాంక్​ స్టోరేజ్​లో చుక్క నీరు లేదు' - ఆదోని

కర్నూలు జిల్లా ఆదోనిలో బసాపురం సమ్మర్ ట్యాంక్​ స్టోరేజ్​లో నీళ్లు పూర్తి స్థాయిలో లేకపోవడంతో వేసవిలో ప్రజలకు ఇబ్బందులు తప్పవని సీపీఎం నాయకులు అన్నారు. వెంటనే మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులను డిమాండ్​ చేశారు. పాలకుల నిర్లక్ష్యం వల్లే ట్యాంక్​ స్టోరేజ్​లో చుక్క నీరు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

cpi leaders visited summer tank storage in adoni kurnool
సీపీఎం నాయకులు
author img

By

Published : Jan 10, 2021, 3:34 PM IST

పాలకుల నిర్లక్ష్యం వల్లే కర్నూలు జిల్లా ఆదోనిలో బసాపురం సమ్మర్ ట్యాంక్​ స్టోరేజ్​లో చుక్క నీరు లేకుండా పోయిందని..సీపీఎం నాయకులు విమర్శించారు. సమ్మర్ ట్యాంక్​ను సీపీఎం నాయకులు పరిశీలించారు. అధికారులు ముందుగా స్పందించి ఉంటే పట్టణంలో నీటి కొరత ఉండేది కాదని నాయకులు అన్నారు. పట్టణంలో తాగునీటి సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతుందని.. వెంటనే మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులను డిమాండ్​ చేశారు. ఎల్​ఎల్సీ కాలువ మూత పడేలోపు ట్యాంకులో పూర్తి స్థాయిలో నింపాల్సి ఉన్నా.. ఇప్పటికీ మరమ్మతులు పూర్తి కాకపోవడంతో వేసవిలో నీటి ఎద్దడికి ఉంటుందని తెలిపారు. మరమ్మతుల సకాలంలో పూర్తి చేయలని.. లేకపోతే ఆందోళన చేస్తామని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు హెచ్చరించారు.

ఇదీ చదవండి: 'కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.