ప్రాంతీయ అభివృద్ధి మండళ్లతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి. సత్యనారాయణ మూర్తి అన్నారు. పరిపాలనా కేంద్రం ఒకేచోట ఉండి.. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఆయన తెలిపారు. ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. కేంద్ర పాలన ఆశాజనకంగా లేదని అభిప్రాయపడ్డారు. కర్నూలు జిల్లా నంద్యాలలో సీపీఐ ఆధ్వర్యంలో రాజకీయ సైద్ధాంతిక శిక్షణా తరగతులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీపీఐ నాయకులు, రాయలసీమ జిల్లాల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: