గత ప్రభుత్వంలో పేదల కోసం నిర్మించిన టిడ్కో ఇళ్లను వెంటనే లబ్దిదారులకు కేటాయించాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. లబ్దిదారులు లక్షరుపాయల వరకు కట్టారని వారికి ఇల్లు కేటాయించడంలో వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఇంటి బాడుగలు కట్టుకోలేని స్థితిలో ప్రస్తుతం ప్రజలు ఉన్నారని ముఖ్యమంత్రి త్వరగా స్పందించి ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో లబ్దిదారులతో ఇళ్ల ఆక్రమణను సీపీఐ ఆధ్వర్యంలో చేపడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇదీ చదవండి: దేశంలో తగ్గిన యాక్టివ్ కేసులు- భారీగా పెరిగిన రికవరీలు