కర్నూలులో కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం రెండో రోజు ప్రశాంతంగా సాగింది. జిల్లాలోని అర్బన్ హెల్త్ సెంటర్లో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను జిల్లా అదనపు కలెక్టర్ ఖాజా మెహిద్దీన్ పరిశీలించారు. టీకా వేసుకునేందుకు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని.. హెల్త్ వర్కర్స్ అవగాహన కల్పించారు. ఇప్పటివరకు జిల్లాలో టీకా వేసుకున్నవారికి ఎలాంటి దుష్ప్రభావాలు కలగలేదని వైద్యులు తెలిపారు. టీకా వేసుకున్న వారు అరగంట పాటు వ్యాక్సినేషన్ కేంద్రంలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉండేవిధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి: కరోనా టీకా పంపిణీపై సైకత శిల్పం