ETV Bharat / state

'మనం కంట్రోల్ తప్పితే.. కరోనా కూడా కంట్రోల్ తప్పుతుంది'

కరోనా రోగులకు ఇంట్లోనే వైద్యం పొందే విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందని రాష్ట్ర కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేకాధికారి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. గాలి ద్వారా కరోనా వ్యాపించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. తగు జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను కట్టడి చేయవచ్చని చెబుతున్న ప్రభాకర్ రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి

covid commmand control centre special offficer dr. prabhaker reddy on corona
రాష్ట్ర కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేకాధికారి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి
author img

By

Published : Jul 9, 2020, 3:59 PM IST

ప్రశ్న: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది?

జవాబు: రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ కంట్రోల్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. రాష్ట్రంలో ట్రిపుల్ టీ విధానంలో ముందుకు వెళ్తున్నాం. దేశంలోనే అత్యధికంగా పరీక్షలు చేసే రాష్ట్రంగా గుర్తింపు పొందాం. ఇప్పటికే పది లక్షలకు పైగా పరీక్షలు చేశాం. 87 ల్యాబ్‌ల్లో రోజుకు 3500 పరీక్షలు చేసే స్థాయికి చేరుకున్నాం. పరీక్షలు చేయడమే కాకుండా ప్రైమరీ కాంటాక్టులను గుర్తించి ఐసోలేషన్ చేస్తున్నాం. రికవరీ రేటు కూడా బాగుంది.

ప్రశ్న: లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన తరువాత కేసులు సంఖ్య ఎందుకు పెరుగుతోంది?

జవాబు: లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత వలస వచ్చిన వారి నుంచి సరిహద్దు ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా పెరగడం జరిగింది. లాక్ డౌన్ ఉన్నప్పుడు కేసులు, మరణాలు తక్కువగా ఉన్నాయి. మనం కంట్రోల్ తప్పితే కరోనా కూడా కంట్రోల్ తప్పుతుంది. కరోనాతో సహజీవనం చేయాల్సిందే. ఇన్‌ఫెక్షన్ వచ్చే రేటు 1.5 ఉంది. ఈ రేటు 2 దాటిందంటే చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అప్పుడు కంట్రోల్ చేయడం కష్టంగా ఉంటుంది. విపరీతంగా కేసులు వస్తే పడకలు సరిపోవు, వైద్య సదుపాయాలు కష్టం అవుతాయి. అందరూ మాస్కులు ధరించి, శానిటైజర్లు వాడాలి. జాగ్రత్తలు పాటించాలి.

ప్రశ్న: ప్రభుత్వం వైపు నుంచి కరోనా కట్టడికి ఏం చేస్తున్నారు..?

జవాబు: కేసుల వ్యాప్తి పెరగకుండా ఉండటానికి టెస్టింగ్, ట్రేసింగ్ చేస్తున్నాం. కేసులు పెరిగినా మరణాలు తగ్గించడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. 40 వేల పడకలుసిద్ధం చేశాం. ఇందులో 15 వేల ఆక్సిజన్ పడకలు, 5 వేల వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయి. ప్రతి జిల్లాకు వెయ్యి కోవిడ్ కేర్ సెంటర్లు పెట్టాం. హోం ఐసోలేషన్ కు కూడా ప్రాముఖ్యత ఇస్తున్నాం..

ప్రశ్న: హోం ఐసోలేషన్‌ లో ఉండాలంటే ఎవరిని సంప్రదించాలి..?

జవాబు: మైల్డ్ కేసులు, ఏ సింప్టమాటిక్ కేసులు ఇవే 60 శాతం పైన కేసులు ఉంటాయి. చాలా మందికి లక్షణాలు కూడా ఉండవు. వీరికి పరీక్షల్లో పాజిటివ్ వస్తే కోవిడ్ కేంద్రాలకు తీసుకెళ్లరు. హోం ఐసోలేషన్లో ఉంటారు. అంటే మెడికల్ ఆఫీసర్ హోం ఐసోలేషన్‌కు సిఫారసు చేస్తారు. పరీక్ష ఫలితాలు ఆలస్యమైనా స్వచ్ఛందంగా హోం ఐసోలేషన్‌లో ఉండవచ్చు.

ప్రశ్న: ఇప్పటి వరకు హోం ఐసోలేషన్లో ఎవరైనా ఉన్నారా? ఈ ప్రక్రియ మొదలు పెట్టారా..?

జవాబు: కొన్ని జిల్లాల్లో హోం ఐసోలేషన్ మొదలైంది. అన్ని చోట్ల అధికారులను నియమించడం జరిగింది.

ప్రశ్న: గాలి ద్వారా కూడా కరోనా వ్యాపిస్తుందని అంటున్నారు? ప్రభుత్వం దృష్టికి వచ్చిందా..?

జవాబు: ప్రభుత్వం మాస్కు వేసుకోమని చెబుతుంది. గాలి ద్వారా వ్యాపించడం లేదు. అటువంటి పరిస్థితి ఉంటే మన రాష్ట్రంలో 50 శాతం మంది కరోనా బారిన పడి ఉండే వారు. ఇది అపోహ మాత్రమే. ఇది ఎయిర్ బార్న్ కాదు. ఎయిర్ డ్రాప్‌ లెట్ స్ప్రెడ్ మాత్రమే.

ప్రశ్న: కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎప్పుడు తగ్గుముఖం పడుతుంది..?

జవాబు: వ్యాక్సిన్ రావడానికి సమయం పడుతుంది. అంతవరకు మాస్క్, శానిటైజర్లు, భౌతికదూరం పాటించడం చేస్తే కరోనా తగ్గుముఖం పడుతుంది.

ప్రశ్న: రాష్ట్రంలో మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కారణం ఏమిటి..?

జవాబు: కర్నూలు, కృష్ణ జిల్లాలో పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉండటంతో మరణాలు ఎక్కువగా ఉన్నాయి. రోగి ఆసుపత్రికి వచ్చే సమయం కూడా ముఖ్యం. లక్షణాలు కనపడిన వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. అప్పుడే మరణాల రేటు తగ్గుతుంది.

ప్రశ్న: ప్రజలకు ఎలాంటి జాగ్రత్తలు సూచిస్తారు..?

జవాబు: కరోనాను తేలికగా తీసుకోవద్దు. కరోనాను కంట్రోల్ చేయగలం. మాస్కు వాడటం, శానిటైజర్లు వాడటం, భౌతిక దూరం పాటించడంచేయాలి. బహిరంగ ప్రదేశాల్లోకి ఎక్కువగా రాకూడదు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 1,555 కరోనా కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.