కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సీసీఐ పత్తి కొనుగోలులో ఆలస్యంపై రైతులు ఆందోళన చేశారు. సీసీఐ కేంద్రంలో వరుసగా కాకుండా.. పలుకుబడి ఉన్న రైతులవి వెంటనే కొనుగోలు చేస్తున్నారని పలువురు ఆరోపించారు. చిన్న, సన్నకారు రైతుల పత్తిని రోజుల తరబడి కొనకుండా సీసీఐ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. అన్నదాతల ఆందోళనతో జాతీయ రహదారిపై వందలాది వాహనాలు నిలిచిపోవడం వల్ల ట్రాఫిక్కు అంతరాయం కలిగింది.
ఇవీ చదవండి..