శ్రీశైల క్షేత్రంలో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. శ్రీశైల దేవస్థానం ఇంజినీరింగ్ విభాగంలో పనిచేసే ఓ అధికారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మంగళవారం సదరు అధికారికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌గా గుర్తించారు.
ఆయనకు హోం ఐసోలేషన్ ద్వారా చికిత్స చేస్తున్నారు. అధికారి కుటుంబ సభ్యులకు నెగిటివ్‌గా ఫలితాలు వచ్చాయి. దేవస్థానంలో పనిచేసే సిబ్బంది అందరికీ కరోనా వ్యాక్సిన్ వేయాలని అధికారులు ఆలోచనలో ఉన్నారు.
ఇదీ చదవండి:
కృష్ణా జలాల వివాదం.. నేటి నుంచి బ్రిజేష్ ట్రైబ్యునల్ విచారణ