కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతునే ఉంది. జిల్లాలో 1,842 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 63 మందికి పాజిటివ్‌గా తేలింది. అత్యధికంగా ఆదోని, కర్నూలు నగరంలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. సోమవారం ఆదోనిలో 36, కర్నూలులో 12, ఆత్మకూరులో 7, ఎమ్మిగనూరులో 3, కౌతాళంలో 1, ఆత్మకూరు రూరల్‌లో ఒక కేసు నమాదు కాగా ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా సోకింది.
కోలుకున్న 2 నెలల చిన్నారి
సోమవారం కరోనా నుంచి పూర్తిగా కోలుకొని ఆస్పత్రి నుంచి 24 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇందులో రెండు నెలల చిన్నారి ఉంది. దేవనకొండ మండలం తెర్నేకల్‌కు చెందిన చిన్నారి.. కరోనాతో జీజీహెచ్‌లో చికిత్స పొందింది. చిన్నారి కరోనాను జయించడంపై జిల్లా కలెక్టర్ వీరపాండియన్ వైద్యులను అభినందించారు. ఇప్పటి వరకు జిల్లాలో కరోనాను జయించిన వారి సంఖ్య 853 కి చేరింది.
ఇదీ చూడండి..