కర్నూలు జిల్లా ఆదోనిలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటి వరకు 246 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అప్రమత్తమైన అధికార యంత్రాంగం పట్టణంలో లాక్డౌన్ పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. రెండు రోజుల వ్యవధిలో ఆదోనిలోని స్త్రీలు, చిన్న పిల్లల ఆసుపత్రిలో పనిచేస్తున్న 21 మందికి కరోనా సోకింది. దీంతో ఆసుపత్రి శానిటేషన్ చేసి అత్యవసర సేవలు మాత్రమే అందిస్తున్నారు. నిత్యావసరాల కోసం ఉదయం 6 నుంచి ఉదయం 9 గంటల వరకు మాత్రమే అనుమతించారు. పట్టణంలో కంటైన్మెంట్ జోన్లలో ప్రజలు బయటికి రాకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. మరోవైపు ఎమ్మిగనూరులో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మున్సిపల్ అధికారులు స్వచ్ఛంద లాక్ డౌన్ విధించారు. ఉదయం 6 గంటల నుంచి 11గంటల వరకు వ్యాపారులు దుకాణాలు తెరిచి తర్వాత మూసివేస్తున్నారు.
ఇదీ చూడండి నిందితుడికి కరోనా పాజిటివ్... పోలీసులకు కొవిడ్ పరీక్షలు