ETV Bharat / state

తగ్గింది కదా అని నిర్లక్ష్యం వహిస్తే... ప్రమాదం తప్పదు!

కరోనా వైరస్‌ అంటే కర్నూలు అనే విధంగా కేసులు హడలెత్తించాయి. దేశంలో వేగంగా విస్తరిస్తున్న పదిహేను కేంద్రాలను గుర్తించగా అందులో జిల్లాలోని కందనవోలు ఉంది. పాజిటివ్‌ కేసుల నమోదు, మరణాల్లో ఆగస్టులో జిల్లా ముందు వరుసలోకి వెళ్లింది. ఆ తర్వాత మెల్లగా కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. జిల్లాలో పాజిటివ్‌ కేసుల రేటు 8.14 కాగా, రికవరీ రేటు 98.56గా గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం తక్కువ కేసులే నమోదవుతుండటంతో కరోనా హైరానా నుంచి కర్నూలు జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కరోనా తగ్గింది కదా? అని నిర్లక్ష్యం వహిస్తే సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభమవుతుందని వైద్యులు చెబుతున్నారు.

Corona cases decline in Kurnool district
కరోనా తగ్గింది కదా అని నిర్లక్ష్యం వహిస్తే
author img

By

Published : Nov 5, 2020, 3:41 PM IST

Updated : Nov 6, 2020, 1:23 PM IST

కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లుగా మార్చే ప్రక్రియను కర్నూలు జిల్లాలో తూచా తప్పకుండా అమలు పరిచారు. అన్‌లాక్‌ అమలవుతున్న కొద్దీ కంటైన్మెంట్‌ జోన్‌ల పరిధిని అర కిలోమీటర్ నుంచి వంద మీటర్లకు తగ్గించారే తప్ప ప్రక్రియను కొనసాగించడం ఆపకపోవడంతో వైరస్‌ వ్యాప్తి అదుపులోకి వచ్చింది. బస్సుల్లో ఆరు బృందాలు తొలి నుంచే గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 2 వేల నుంచి 2,500 రక్త నమూనాలు సేకరించేలా ప్రణాళిక చేయడం వ్యాప్తి వేగాన్ని నిర్ధరించేలా చేసింది. వెయ్యి నుంచి1500 కేసులు నమోదయ్యే చోట్ల స్వీయ గృహ నిర్బంధం (హోమ్‌ ఐసోలేషన్‌) ఎత్తి వేశారు. ప్రతి ప్రాథమిక వైద్యశాల వద్ద మూడు వాహనాలు ఉంచి రోగులను సమీపంలోని కోవిడ్‌ కేర్‌ సెంటర్లకు తరలించడం వల్ల వ్యాప్తి కట్టడి చేయగలిగారు.

Corona cases decline in Kurnool district
నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదం తప్పదు

మాస్కు ధరించకపోతే...!

జిల్లాలో మాస్క్‌ ధరించకుండా ద్విచక్రవాహనాలపై తిరిగే వారికి పోలీసులు జరిమానా విధించారు. జూన్‌ 23 నుంచి నవబంరు 2వ తేదీ వరకు 93,240 మంది మాస్క్‌ ధరించని కారణంగా రూ.74,43,450 జరిమానా సమకూరింది. గతంలో మాస్క్‌లేక పోతే రూ.100 జరిమానా విధించగా, ప్రస్తుతం అది రూ.200కి చేరింది.

పురుషులే అధికం

కర్నూలు జిల్లాలో ఈ నెల 3వ తేదీ వరకు 7.35లక్షల పరీక్షలు చేశారు. పాజిటివ్‌ కేసుల సంఖ్య నాల్గవ తేదీ నాటికి 59,600కు చేరింది. మార్చి నుంచి జిల్లాలో కరోనా వైరస్‌ తెరపైకి రాగా, జులైలో 15వేలు, ఆగస్టులో 27వేలు, సెప్టెంబర్‌లో 10 వేలతో ఈ మూడు నెలల్లోనే ఉద్ధృతి బాగా పెరిగింది. నెల రోజులుగా రెండంకెల కేసులే నమోదవడంతో రాష్ట్రంలోనే అతి తక్కువ కేసులు నమోదవుతున్న జిల్లాగా కర్నూలు నిలిచింది. కోవిడ్‌ బారిన పడినవారిలో ఎక్కువ మంది పురుషులే ఉన్నారు. మహిళలు 24,337 (41%), పురుషులు 35,166(59%), మృతుల్లోనూ మహిళల కన్నా 131(27%), పురుషులు 351(73%)తో ఎక్కువ ఉన్నారు. కరోనా ప్రస్తుతం తగ్గింది కదా అని నిర్లక్ష్యం వహిస్తే సెకండ్‌ వేవ్‌ వచ్చే అవకశాలున్నాయని అధికారులు ముందస్తు హెచ్చరికలు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

పాణ్యం వద్ద రైతు సంఘం నాయకుల రాస్తారోకో

Last Updated : Nov 6, 2020, 1:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.