వైకాపా ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం పని చేస్తుందని... ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా తెలిపారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో మెుదటి సారి కర్నూలు నగరంలో ఆయన పర్యటించారు పర్యటించారు. ఈ సందర్భంగా ఉర్దూ యూనివర్శిటీని సందర్శించారు. నిధులు మంజూరైనా... ఇంత వరకూ సొంత భవనాలు నిర్మించలేదని... వర్శిటీలో సమస్యలు ఉన్నాయని వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి దుల్హాన్ పథకం వర్తింప చేస్తామన్నారు. వక్ఫ్ బోర్డు భూములను కాపాడుతామని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి... కార్యకర్తలపై దాడులను సహించేది లేదు: చంద్రబాబు