కర్నూలు, కడప జిల్లాల సరిహద్దులోని రాజోలి ఆనకట్ట వద్ద జలాశయం నిర్మించేందుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులను జారీ చేసింది. రూ. 1357.10 కోట్లతో 2.95 టీఎంసీల సామర్థ్యం కలిగిన జలాశయం నిర్మించనున్నారు. వాస్తవానికి రూ. 291.02 కోట్లతో జలాశయం నిర్మించేలా 2008 డిసెంబరు 23న అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసినా నిర్మాణానికి నోచుకోలేదు. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి రాజోలి జలాశయం నిర్మించేందుకు ముందుకొచ్చారు. ఈనెల 24న శంఖుస్థాపన చేయనున్నారు.
ఇవీ చదవండి