కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం సుంకేశ్వరిలో... లక్ష్మమ్మ అవ్వ జాతర సందర్భంగా తెలుగుదేశం, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఏరువాక పౌర్ణమి సందర్భంగా.. గురువారం సాయంత్రం లక్ష్మమ్మ అవ్వ జాతర నిర్వహించారు. బ్యానర్ విషయంలో ఉదయమే రెండు పార్టీల నేతలు కార్యకర్తలు గొడవపడ్డారు. అవ్వ ప్రభ ఊరేగింపు సమయంలో ఎదురుపడిన వైకాపాకు చెందిన సర్పంచ్ ముక్కరన్నా... తెలుగుదేశం వర్గాలు వాదనకు దిగారు. అది ఘర్షణకు దారితీయటంతో... రాళ్లు, చెప్పులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అక్కడే ఉన్న పోలీసులు రెండు వర్గాలనూ విడదీశారు. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: murder : కామేపల్లిలో తెదేపా కార్యకర్త హత్య