ETV Bharat / state

Chandrababu visit to Rayalaseema Projects: రాయలసీమ ప్రాజెక్టుల కోసం సీఎం జగన్‌ ఏనాడైనా పని చేశారా..?: చంద్రబాబు

Chandrababu Naidu visit to Rayalaseema projects: సీఎం జగన్‌ రాయలసీమ ద్రోహి అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందుచూపుతో రాయలసీమ నీటి ప్రాజెక్టులు చేపడితే.. వైసీపీ ప్రభుత్వం వాటిని నాశనం చేసిందని ఆగ్రహించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని భూస్థాపితం చేస్తే తప్ప.. రాయలసీమకు న్యాయం జరగదని చంద్రబాబు పిలుపునిచ్చారు.

CBN
CBN
author img

By

Published : Aug 1, 2023, 4:24 PM IST

Updated : Aug 2, 2023, 6:27 AM IST

రాయలసీమ ప్రాజెక్టుల కోసం సీఎం జగన్‌ ఏనాడైనా పని చేశారా..?: చంద్రబాబు

Chandrababu visit to Rayalaseema projects: ‘సాగునీటి ప్రాజెక్టుల సందర్శన’ పేరుతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేటి నుంచి పర్యటన ప్రారంభించారు. పర్యటనలో భాగంగా ఆయన అనంతపురం, వైయస్సార్, ఉమ్మడి కర్నూలు జిల్లాల్లోని ప్రాజెక్టులను సందర్శించనున్నారు. ఈ క్రమంలో ఈరోజు ప్రాజెక్టుల విధ్వంసంపై 'యుద్ధభేరి' పేరిట ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్కూరులో బహిరంగ సభ నిర్వహించారు.

జగన్.. ముక్కు నేలకురాసి రాజీనామా చేసి పో.. బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ.. ముఖ్యమంత్రి జగన్‌పై నిప్పులు చెరిగారు. సీఎం జగన్‌ రాయలసీమ ద్రోహి అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ కోసం సీఎం జగన్‌ ఏనాడైనా పని చేశారా..? అని ప్రశ్నించారు. ముందుచూపుతో రాయలసీమలో నీటి ప్రాజెక్టులు చేపడితే.. వైస్సార్సీపీ ప్రభుత్వం దానిని పూర్తిగా నాశనం చేసిందని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని భూస్థాపితం చేస్తే తప్ప.. రాయలసీమకు న్యాయం జరగదని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రానికి అన్యాయం, రాయలసీమకు ద్రోహం చేసిన దుర్మార్గుడు.. సీఎం జగన్ రెడ్డి అని చంద్రబాబు ధ్వజమెత్తారు. సైకోలా ప్రవర్తించకుండా రాయలసీమ ప్రాజెక్టులకు ఏం చేశాడో..? జగన్ రెడ్డి చెప్పాలన్న చంద్రబాబు.. చెప్పలేని పక్షంలో రాయలసీమలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసి పోవాలన్నారు.

ప్రాజెక్టులు పూర్తి చేసి, ధరలు తగ్గిస్తాం.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే.. ఏయే కార్యక్రమాలు, ప్రాజెక్టులు పూర్తి చేయనున్నారో చంద్రబాబు నాయుడు ప్రజలకు వివరించారు. టీడీపీ వచ్చాక.. ప్రాజెక్టులను పూర్తి చేసి చూపిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మినీ మేనిఫెస్టో సూపర్ హిట్ అయ్యిందన్నారు. మహిళలు, రైతులు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. నూతన విద్యుత్ విధానం తెచ్చి.. విద్యుత్ చార్జీలు తగ్గించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందన్నారు. సీఎం జగన్.. నాసిరకం మద్యం సరఫరాతో పేదల రక్తాన్ని తాగుతున్నాడని.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాత మద్యం విధానాన్ని తెచ్చి.. ధరలు తగ్గిస్తామన్నారు. ఆ తర్వాత నాసిరకం మద్యం నుంచి విముక్తి కలిగిస్తామన్నారు.

జగన్.. రాయలసీమ ద్రోహి.. నాలుగేళ్లలో ప్రాజెక్టుల్లో చుక్క నీరు లేకుండా చేసిన చరిత్రహీనుడు జగన్ మోహన్ రెడ్డి అని చంద్రబాబు మండిపడ్డారు. రాయలసీమకు ఎవ్వరూ చేయనంత ద్రోహం జగన్ చేశారని విమర్శించారు. రాయలసీమ దశ మార్చిన ఘనత ఎన్టీఆర్‌దేనన్న చంద్రబాబు.. ప్రతీ ఎకరాకు నీళ్లివ్వాలనే సంకల్పం తెలుగుదేశం పార్టీదేనని గుర్తు చేశారు. రాయలసీమకు చేస్తున్న అన్యాయం పట్ల జగన్‌కు సిగ్గనిపించడం లేదా..? అని వ్యాఖ్యానించారు. రాయలసీమ ప్రాజెక్టుల కోసం తెలుగుదేశం హయాంలో రూ.12,441 కోట్లు ఖర్చు చేస్తే.. వైఎస్సార్సీపీ హయాంలో రూ. 2011 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 198 ప్రాజెక్టులకు గాను.. రాయలసీమలో 102 ప్రాజెక్టులను ప్రీక్లోజర్ చేసేశారన్న చంద్రబాబు.. మరో ఐదేళ్ల వరకూ ప్రాజెక్టులకు టెండర్లు పిలవొద్దని సైకో జగన్ జీవో జారీ చేశారని ఆగ్రహించారు.

టీడీపీ హయంలో రూ.549 కోట్లు.. జగన్ హయాంలో రూ.5 కోట్లు.. ఆ తర్వాత ముచ్చుమర్రి ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు సందర్శించారు. ముచ్చుమర్రికి టీడీపీ హయాంలో రూ.549 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో రూ.5 కోట్లే ఖర్చు చేసిందని ఆగ్రహించారు. ముచ్చుమర్రి ప్రజలు, రైతులు ధర్నాలు చేస్తున్న ప్రాజెక్టు నిర్వహణ, కాల్వల మరమ్మతుకూ నిధులు ఇవ్వడం లేదని చంద్రబాబు దుయ్యబట్టారు.

నా వయస్సు గురించి మాట్లాడే ఈ సైకో జగన్..నాలాగా 18 గంటలు పని చేయగలడా..?. సింహంలా ఉంటూ సింహంలానే పోరాడుతా. ప్రాజెక్టుల విధ్వంసంపై నందికొట్కూరు నుంచే యుద్ధభేరికి శ్రీకారం చుడుతున్నా. పని చేయని ఈ వైసీపీ నాయకులను, జగన్‌ను మురికి కాల్వల్లో ముంచాలి. జగన్ రెడ్డి చేసిన ప్రాజెక్టుల విధ్వంసం వల్ల భవిష్యత్తు తరాలకు జరిగే నష్టం వివరించేందుకే ఈరోజు నుంచి పది రోజులపాటు ఈ యుద్ధభేరికి బయలుదేరాను.-చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత

Last Updated : Aug 2, 2023, 6:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.