ETV Bharat / state

'వారి వల్లే ఉద్యోగం మానేసి... కూరగాయలు అమ్ముతున్నాను' - chandrababu tour of kurnool news

బీఫార్మసీ చేసి ఉద్యోగంలో చేరాను. అంతా సవ్యంగా సాగుతుందనుకుంటున్న సమయంలో... తమ చిన్న తమ్ముడిని వైకాపా కార్యకర్తలు హత్యచేశారు. ఉద్యోగం మానేసి... ప్రస్తుతం రైతుబజార్లో కూరగాయలు అమ్ముకుంటున్నాను. ఆనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రులను చూసుకుంటున్నాను. మా కుటుంబానికి అన్యాయం జరిగిందంటూ... కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబుకు... న్యాయకల్ గ్రామానికి చెందిన భారతి వివరించింది.

Chandrababu meeting with YCP victims in kurnool tour

author img

By

Published : Dec 3, 2019, 6:48 PM IST

"ఉద్యోగం మానేశాను..కూరగాయలు అమ్ముకుంటున్నాను"

కర్నూలు జిల్లాలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన రెండోరోజు కొనసాగింది. వైకాపా బాధితులతో సమావేశమైన చంద్రబాబు... వారి బాధలు విన్నారు. జిల్లావ్యాప్తంగా తెదేపా నాయకులు, కార్యకర్తలపై 33 కేసులు పెట్టారని, 10 దాడులు జరిగాయని, ఇద్దరు కార్యకర్తలు ఆత్మహత్య చేసుకున్నారని చంద్రబాబు వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బాధితులు... వైకాపా ప్రభుత్వం తమపై ఏ విధంగా దాడులకు పాల్పడుతోందో వివరించారు.

కూరగాయలు అమ్ముతున్నాను..!
తమ చిన్న తమ్ముడిని వైకాపా కార్యకర్తలు హత్యచేశారని బాధిత కుటుంబానికి చెందిన భారతి... చంద్రబాబు వద్ద వాపోయింది. ఫార్మసీ చేసిన తాను ఉద్యోగం మానేసి... ప్రస్తుతం రైతుబజార్లో కూరగాయలు అమ్ముకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. తమ కుటుంబానికి ఇలాంటి పరిస్థితి రావడంతో... తన జీవితం నాశనమైపోయిందని కన్నీటి పర్యంతమైంది. ఎన్ని కష్టాలు వచ్చినా భయపడేది లేదని... వెనకడుగేసే ప్రసక్తే లేదని పేర్కొంది.

రాజకీయ దాడులతో మానసికంగా కుంగిపోయి... తన తండ్రి మృతిచెందారని గోనెగండ్ల మండలానికి చెందిన మరో బాధితుడు నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి : 'దాడులను సహించం.. కార్యకర్తలను కాపాడుకుంటాం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.