సాక్షుల్ని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్న జంట హత్యల దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు డీజీపీ గౌతం సవాంగ్‌కు లేఖ రాశారు. కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో జూన్ 17న వడ్డు నాగేశ్వర్‌రెడ్డి, వడ్డు ప్రతాప్‌రెడ్డిలను వైకాపా గూండాలు దారుణంగా హత్య చేశారని ఆరోపించారు. వారి సోదరుడు మోహన్ రెడ్డికి నివాళులు అర్పించడానికి శ్మశానవాటికకు వెళ్లినప్పుడు వైకాపా నాయకులు వారిని హత్య చేశారని ధ్వజమెత్తారు.
ఇలాంటి హింసాత్మక చర్యలకు సమాజంలో చోటు ఉండకూడదన్నారు. నిందితుల్ని ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. బాధితుల కుటుంబ సభ్యులను, సాక్షులను దోషులు ఫోన్లో బెదిరిస్తున్నారని ఆరోపించారు. నేరస్థులను తక్షణమే అరెస్టు చేసి సాక్షులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: RRR movie: ఆర్ఆర్ఆర్ ట్రీట్.. 'దోస్తీ' సాంగ్ వచ్చేసింది