కర్నూలు జిల్లాలో చేపట్టిన డీఆర్‌డీవో మిస్సైల్ టెస్టింగ్ ప్రాజెక్టు వచ్చే ఏడాది సెప్టెంబర్‌కు పూర్తవుతుందని కేంద్రం తెలిపింది. భాజపా ఎంపీ టీజీ వెంకటేశ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి శ్రీపాదనాయక్ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
కరోనా నేపథ్యంలో ప్రాజెక్టు పూర్తి కావడానికి నాలుగు నెలల గడువు పెరిగిందని పేర్కొన్నారు. 2016, 2017లో ఈ ప్రాజెక్టు కోసం 2 వేల 989 ఎకరాలు సేకరించినట్లు కేంద్రమంత్రి చెప్పారు.
ఇదీ చదవండి : సీఎం క్యాంపు కార్యాలయం వద్ద పోషణ అభియాన్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం