కర్నూలు జిల్లా నంద్యాలలో కోవిడ్ -19 కేంద్ర బృందం పర్యటించింది. పట్టణంలోని ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. కరోనా పాజిటివ్ కేసులపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పట్టణంలోని బైటిపేట ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం నంద్యాల మండలంలోని చాపిరేవుల గ్రామంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అక్కడ వసతులను పరిశీలించారు. కేంద్ర బృందం సభ్యులు డాక్టర్ మధుమతి ధూభే, డాక్టరు సంజయ్ కుమార్ సాదుఖాన్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి వైరస్ పట్ల ప్రజల్లో భయం, ఆందోళన తొలగించాలి: సీఎం జగన్